భూస్వామ్య వ్యవస్థకు గుర్తుగా ఉన్న వీఆర్ఏ వ్యవస్థను రాష్ట్ర సర్కారు రద్దు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించ డంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీ కరించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. ఉత్తర్వులను కూడా గత సోమ వారం విడుదల చేశారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1982 మందికి ప్రయోజనం చేకూర నుంది. కాగా.. వీరి విద్యార్హతను బట్టి వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నా రు. కాగా.. నీరటి, మసూరు, లషర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలిచేవారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనుం డడంపై వీఆర్ఏలు వారం రోజులుగా సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– హాజీపూర్, జూలై 31
హాజీపూర్, జూలై 31 : వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. రెవెన్యూ శాఖలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వీఆర్ఏల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏండ్ల నుంచి చాలీచాలనీ వేతనాలతో సేవలందిస్తున్న వీరిని విద్యార్హతను బట్టి వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. క్రమబద్ధీకరించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,982 మందికి మేలు జరుగనుంది. నిర్మల్ జిల్లాలో 726 మంది, మంచిర్యాలలో 542, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 317, ఆదిలాబాద్లో 397 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. వీరి విద్యార్హతల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తూ, జీతాలు ఇవ్వనున్నారు.
విద్యార్హతల ప్రకారం పే స్కేల్
వీఆర్ఏల్లో డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగిన వారిని అవసరమైన ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు. ఇదే అర్హతతో మున్సిపాలిటీలకు కేటాయిస్తే వారిని వార్డు అధికారులుగా నియమిస్తారు. వీరికి కనీస వేతనంగా రూ.24,280 నిర్ణయించనున్నారు. అలాగే ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారిని రికార్డు అస్టిటెంట్లుగా నియమించి కనీస వేతనంగా రూ.22,240 చెల్లించనున్నారు. పదో తరగతి చదివిన వారికి ప్రభుత్వం నిర్ణయించిన శాఖల్లో ఆఫీస్ సబార్డినేటర్, హెల్పర్లుగా నియమించనున్నారు. వీరికి రూ.18 వేలు కనీస వేతనంగా చెల్లించనున్నారు. ప్రస్తుతం రూ.11,700 వేతనం పొందుతున్న వీఆర్ఏలు ఇక నుంచి భారీ జీతాలు అందుకోనున్నారు. దీనితోపాటు అలవెన్సులు, ఉద్యోగ భద్రత పొందనున్నారు. విధి నిర్వాహణలో మరణించిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియమాకాల కింద వారికి విద్యార్హతల ప్రకారం ఉద్యోగాలు కల్పించనున్నారు. కాగా.. మిషన్ భగీరథ, సాగునీటి పారుదల శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఎంత మంది ఏ శాఖకు వెళ్లాలనేది ఖరారు కాలేదు. శాఖలవారీగా సర్దుబాటు చేసే ప్రక్రియను త్వరలో పూర్తి చేసి జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.
సంతోషంగా ఉంది..
వీఆర్ఏలుగా పని చేస్తున్న మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉంది. నేను 2018 సంవత్సరం నుంచి వీఆర్ఏగా పని చేస్తున్నా. మా నాన్న అనంతరం నాకు వీఆర్ఏ ఉద్యోగం వచ్చింది. చాలీచాలనీ వేతనంతో ఇబ్బందులు పడే వాళ్లం. ఇప్పుడు నాకు రికార్డు అస్టిటెంట్ ఉద్యోగం రానుంది. రూ.22,240 పే స్కేల్ ఇవ్వనున్నారు. వీఆర్ఏల అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– సోగాల కృష్ణ, హాజీపూర్ మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు
జిల్లాలవారీగా వీఆర్ఏల విద్యార్హతలు..