జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్.. అల్లోల జిందాబాద్.. నినాదాలతో ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణం దద్దరిల్లింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి జనవాహిని కదిలింది. పట్టణం నలువైపులా గులాబీ మయమైంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రసంగం వినేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాహనాలు, కాలినడకన తరలిరావడంతో ప్రభంజనాన్ని తలపించింది. జనాల విజిల్స్.., కేరింతలు.., చప్పట్లు.., సెల్ఫీలతో ఈ ప్రాంతం మురిసిపోయింది.