జాతి వివక్షలేని.. భారతావని కావాలి
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుత భారతావని నిర్మించుకుందాం.
- తెలంగాణ స్ఫూర్తితో దేశం పురోగమించాలి
- అందుకు మీ ఆశీస్సులు.. మీ అండదండలు ఉండాలి
- త్వరలోనే క్రైస్తవ మత పెద్దలతో సమావేశమవుతా..
- ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో
- బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం పురోగమించి అద్భుత భారతావని నిర్మించుకుందాం.
అందుకోసం మీ ఆశీస్సులు.. మీ అండదండలు.. కావాలని కోరుతున్నా’ అని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న హైదరాబాద్ కార్డినల్ బిషప్ పూల ఆంథోని
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్ఫూర్తితో దేశం పురోగమించాలని ఆకాంక్షించారు. జాతి వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రైస్తవ మతపెద్దలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

