ఖానాపూర్/ఖానాపూర్ టౌన్, ఆగస్టు 21: ఖానాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో పట్టణంలో అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జాన్సన్ నాయక్ నివాసం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బస్టాండు వరకు డీజే చప్పుళ్లతో నృత్యం చేస్తూ ర్యాలీగా వెళ్లారు. అనంతరం తెలంగాణ తల్లి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. సీఎం కేసీఆర్, జాన్సన్ నాయక్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శనిగారపు శ్రావణ్, పాల సంతోష్, షాబీర్పాషా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దస్తురాబాద్, ఆగస్టు 21: ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జాన్సన్ నాయక్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, నృత్యాలు చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీని తీశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు దుర్గం శంకర్, ఉప సర్పంచ్ వర్ధెల్లి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు దాసరి సుధాకర్, అర్గుల రాజనర్సయ్య, బొమ్మెన గోపి. ఎండపెల్లి గంగన్న, చెవుల మద్ది నర్సయ్య, విలాస్ యాదవ్, అల్తాటి రాజేందర్, శ్రీశైలం, శైలేందర్, కిషన్, రవీంద్ర చారి, పాల్గొన్నారు.
కడెం, ఆగస్టు 21: ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌ను సీఎం , అధినేత కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సం బురాలు నిర్వహించుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. స్వీట్లను పంచుకున్నారు. అలాగే పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు.
పెంబి, ఆగస్టు 21: ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూక్యా జాన్సన్ నాయక్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జాన్సన్ నాయక్ యువసైన్యం సభ్యులు పెంబిలో సంబురాలు నిర్వహించారు. భాజాభంజంత్రీలతో ర్యాలీ నిర్వహించారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశా రు. నాయకులు బడుగు మల్లేశ్, కొడగంటి నర్సయ్య, సుతారి మహేందర్, గోధూరి సరోజ, ధర్మేందర్ పాల్గొన్నారు.