ఎదులాపురం, నవంబర్ 7 : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న 1200 మంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, ఇది వదలకపోతే ఈనెల 20వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్తామని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ ఆశన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గురువారం కలెక్టరేట్ ఎదుట ఒక రోజు మహాదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆశన్న మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నిరవధిక సమ్మె సందర్భంగా ఇచ్చిన ఏ ఒక హామీ అమలు కాలేదని మండిపడ్డారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగన్న, దుబాక రమక, నర్సమ్మ టి.గంగన్న, జిల్లా నాయకులు వాగారావ్, రఫీ, గంగయ్య, దేవుసింగ్, రాజు, వీలాష్, ప్రకాశ్, సంతోష్, సూర్య పాల్గొన్నారు.