నార్నూర్, సెప్టెంబర్ 23 : గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పీ. ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నార్నూర్ మండల కేంద్రంలోని విజయ్ నగర్ కాలనీకి చెందిన కీనక జుగాధిరావు కౌలుకు తీసుకున్న చేనులో గంజాయి సాగు చేస్తున్నట్లు పక్క సమాచారంతో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించమన్నారు.
40 గంజాయి మొక్కలను స్వాధీనం చేశామన్నారు. దీని విలువ 4,40,000 వరకు ఉంటుందన్నారు. జుగాధిరావు ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గంజాయి సాగు చేస్తున్నట్లు పట్టుబడితే ఉపేక్షించేది లేదని, చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ అఖిల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.