కోవ లక్ష్మిని అవమానించడాన్ని ఖండిస్తున్నాం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రోటోకాల్ పాటిం చకుండా అవమాన పర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మంగళ వారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రం లోని గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.
నార్నూర్, జూన్ 2 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రోటోకాల్ పాటిం చకుండా అవమాన పర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మంగళ వారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రం లోని గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడు తూ.. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మిని అవమానించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తోపాటు స్థానిక నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇందులో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్నాయక్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు కనక సత్యనారాయణ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్దేవ్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాశీం, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ఖాన్, ఉపాధ్యక్షుడు రాథోడ్ శివాజీ, నాయకులు సుల్తాన్ఖాన్, చౌహన్ యశ్వంత్రావ్, జాదవ్ రెడ్డి నాయక్, రాథోడ్ సుభాష్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

