కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipet) మండల కేంద్రం ముత్యంపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మండల ప్రీమియర్ లీగ్ మినీ సీజనల్ వన్ క్రికెట్ టోర్నమెంట్ ( Cricket Tournament ) ఆదివారం అట్టహాసంగా ముగిసింది. 15 రోజులుగా కొనసాగిన టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. రాజ్ కుమార్ రాయల్స్, గోవా సూపర్ కింగ్స్, ఎస్ఆర్ హెచ్ కాసిపేట, దేవాపూర్ చార్జెస్, గోవా సూపర్ కింగ్స్ కాసిపేట, ఎస్పీటీ, పల్లంగూడ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మద్య పోటీ పడగా ఫైనల్‌కు పల్లంగూడ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేరాయి.
ఆదివారం చివరి రోజు హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి విన్నర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ కు మొదటి బహుమతి రూ.40వేలతో పాటు ట్రోపీని, రన్నర్ పల్లంగూడ టైటాన్స్ రెండో బహుమతి రూ.30 వేలతో పాటు ట్రోపీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ( MP Gaddam Vamshi Krishna) , బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ( MLA Vinod ) అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, మాజీ వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, దుస్స చందు, అప్పాల శేఖర్, ప్రధాన కార్యదర్శి మైదం రమేశ్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, ఎస్సీ సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, నస్పూరి నర్సింగ్, చింతల సాగర్, నిర్వాహకులు పెట్టెం సునీల్, గంగాదరి రాజ్‌కుమార్, జాడి శివ, గోమాస కేశవులు, దాసరి సల్మార్ రాజ్, అక్కెపల్లి రాజేశం, క్రీడాకారులు పాల్గొన్నారు.