కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం వద్ద సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.2,58,000 నగదును సీజ్ (Cash Seize ) చేసినట్లు కాసిపేట ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu ) తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కోట దివాకర్, కోట శివాజీ అనే ఇద్దరు బోలెరో ట్రాలీలో మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు నగదుతో వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తుండడంతో ఎన్నికల కోడ్ నేపధ్యంలో సీజ్ చేసినట్లు వెల్లడించారు.