‘రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 సిలిండర్‌కు, ఈ కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)కి సంబంధం లేదు. ఉజ్వల కనెక్షన్లకు మాత్రమే కేంద్ర సర్కారు ఈనెల 31వ తేదీ వరకు తుది గడువు విధించింది. మిగతా కనెక్షన్‌దారులు తమ వీలును బట్టి ఎప్పుడైన చేసుకోవచ్చు. ఎలాంటి తుది గడువు లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పటికిప్పుడు ఈ కేవైసీ చేయించుకోకున్నా గ్యాస్ బుకింగ్, సరఫరా యథావిధిగా ఉంటాయి.
అని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలుపుతున్నారు. దీనిని సామాన్య ప్రజలు గమనించాలని, ఏజెన్సీ దుకాణాల వద్ద బారులుదీరొద్దని, బయటి ప్రచారాలు, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు కాగా.. గ్యాస్ కస్టమర్ నంబర్, ఆధార్ నంబర్‌తో వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి వెళితే సిబ్బంది ఆ వివరాలు నమోదు చేసి, వేలిముద్ర తీసుకొని ఈ కేవైసీని పూర్తి చేస్తున్నారు.
– నిర్మల్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ)
Gas Cylinder EKYC |నిర్మల్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : గత నెలలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీల్లో ఈ కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) సిస్టంను ప్రవేశ పె ట్టింది. ముందుగా ఉజ్వల కనెక్షన్లు ఉన్న గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీని పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్ కంపెనీలు ఈ కేవైసీని ప్రారంభించాయి. అయితే చాలా మంది వినియోగదారులు ఈ నెలాఖరుకే తుది గడువు ఉందంటూ వస్తున్న వ దంతులను నమ్మి ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీ స్తూ, వాటి ఎదుటబారులు తీరుతున్నా రు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభు త్వం అందజేస్తున్న ‘ఉజ్వల’ గ్యాస్ కనెక్షన్లు 37,328 ఉన్నాయి. మిగతా అన్ని రకాల కనెక్షన్లు కలిపి 2,49,990 వరకు ఉండగా, వీరంతా ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల ఎదుట క్యూ కడుతున్నారు. వా స్తవానికి కేవలం ఉజ్వల కనెక్షన్లకే ఈ నె లాఖరు వరకు గడువు ఉన్నది. మిగతా కనెక్షన్లకు ఎలాంటి గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు చె బుతున్నారు.
దశలవారీగా ఈ ప్రక్రియ ను పూర్తి చేసేందుకు ఏజెన్సీలు వారి పరిధిలోని వినియోగదారుల సెల్ఫోన్లకు సమాచారం అందిస్తున్నారు. గ్యాస్ కస్టమర్ నంబర్, ఆధార్ నంబర్‌తో వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి వెళితే.. సిబ్బంది ఆ వివరాలన్నీ నమోదు చేసి, వేలిముద్ర తీసుకొని ఈ కేవైసీని పూర్తి చే స్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలో పేరు ఉన్న వి నియోగదారుడు ఒక్కరే వచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ కేవైసీ లేకపోతే గ్యాస్ బుకింగ్ కాదనే పుకార్లను వినియోగదారులు నమ్మొద్దని నిర్వాహకులు చెబుతున్నారు.
రేషన్ కార్డుల తరహాలోనే ఎ ల్పీజీ వినియోగదారులు కూ డా తమ సమీ ప ఏజెన్సీలకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఇది కేంద్రం జా రీ చేసిన ఉజ్వల కనెక్షన్లకే వర్తిస్తున్నది. ఈ కనెక్షన్లు ఉన్న వా రు ఈ నెల 31లోపు ఈ కేవైసీ చేయించుకోవాలి. మిగతా వా రికి ఎలాంటి గడువు విధించలేదు.
ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లే దు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పటికిప్పు డు ఈ కేవైసీ చేయించుకోకున్నా గ్యాస్ బుకింగ్, సరఫరా యథావిధిగా ఉం టుంది. ఈ నెల 16 న జగిత్యాలలో ఎ ల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం ఉన్నది. గ్యాస్ వినియోగదారులకు ఎదురవుతు న్న చిన్నచిన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
-శ్రీనివాస్ గౌడ్, మేనేజర్, ఇండేన్ సర్వీసెస్, నిర్మల్