సీసీ రోడ్లు.. పగుళ్లే పగుళ్లు
ఇది కౌటాల మండలం తలోడి గ్రామంలో రూ. 5 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యతగా ఉండాల్సింది పోయి.. న్లైనా గడవకముందే పగుళ్లు తేలింది. కాంట్రాక్టర్ల ధన దాహానికి లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయనడానికి ఇదే చక్కని ఉదాహరణ.
- కాంట్రాక్టర్ల ధన దాహానికి మూణ్నాళ్ల ముచ్చటగా రోడ్లు
- నాణ్యతను పట్టించుకోకుండా ఆగమాగం పనులు
- న్లైనా గడవకముందే అక్కరకు రాకుండా పోతున్న వైనం
- కోట్లాది ఈజీఎస్ నిధులు వృథా
- పట్టించుకోని అధికారులు
ఇది కౌటాల మండలం తలోడి గ్రామంలో రూ. 5 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యతగా ఉండాల్సింది పోయి.. న్లైనా గడవకముందే పగుళ్లు తేలింది. కాంట్రాక్టర్ల ధన దాహానికి లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయనడానికి ఇదే చక్కని ఉదాహరణ. ఈ ఒక్క రోడ్డే కాదు.. జిల్లాలో అనేకచోట్ల ఇలాంటి దుస్థితే కనిపిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈజీఎస్ నిధుల తో వేస్తున్న సీసీ రోడ్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నెల రోజులైనా గడవకముం దే పగుళ్లు తేలుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పనులు పూర్తిచేయాలనే లక్ష్యం తో కాంట్రాక్టర్లు నాణ్యతను పట్టించుకోకుండా హడావుడిగా పనులు చేసేసి చేతులు దులుపుకుంటుండగా, అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ. 11 కోట్లు.. 519 సీసీ రోడ్లు
జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది రూ. 11 కోట్లతో 519 సీసీ రోడ్లు మం జూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగి సే రెండు నెలల ముందు హడావుడిగా సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. గడువులోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో నాణ్యతపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వందలాదిరోడ్లను ఒకేసారి ప్రారంభించడం.. నాణ్యతను పట్టించుకోకుం డా రాత్రీ& పగలూ తేడాలేకుండా పను లు చేయడం.. ఆపై బిల్లులు పెట్టుకోవడం పరిపాటిగా మారింది.
కనీసం సీసీ రోడ్లకు 15 రోజు లు వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉండగా, ఒక టీ రెండు రోజులు చేసి ఆపై పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో వేసిన కొద్ది రోజుల కే సీసీ రోడ్లు ఎక్కడికక్కడ పగుళ్లు తేలుతున్నాయి. 1:3:6 నిష్పత్తిలో సిమెంట్, ఇసుక, కంకర మిశ్రమంతో 15 సెంటీమీటర్ల ఎత్తులో సీసీ రోడ్లు వేయాల్సి ఉండగా, గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సీసీ రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

