Accidentally fire | బజార్ హత్నూర్ : ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధమైన సంఘటన బజార్ హత్నూర్ మండలం లో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం. మండల కేంద్రానికి చెందిన కొంగర్ల రాము, రాజు అనే అన్నదమ్ములకు చెందిన పశువుల పాకలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
దీంతో గమనించిన స్థానికులు, కుటుంబీకులు మంటలను అర్పే ప్రయత్నం చేశారు. ఎంత సేపటికి మంటలు తగ్గక పోవడం తో అగ్ని మపాక సిబ్బంది కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపాక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పశువుల పాకలో ఉన్న పశు గ్రాసం, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు.