దండేపల్లి, మార్చి 16 : బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో కులగణన సర్వే(సామాజిక, ఆర్థిక, విద్య, ఉ పాధి, రాజకీయ, కుల సర్వే) చేపట్టింది. ఈ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, డాటా ఎం ట్రీ ఆపరేటర్లకు పారితోషికం ఇవ్వకుండా స ర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కులగణన సర్వేలో మొ త్తం 2181 మంది ఎన్యూమరేటర్లు, 224 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వే చేపట్టింది. గతేడాది నవంబర్ 9 నుంచి 24వ తేదీ వరకు సర్వే నిర్వహించారు.
ఇందుకోసం మున్సిపాలిటీల పరిధిలో అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, గ్రామ పంచాయతీల్లో జీపీ కార్యదర్శులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఎంఆర్సీ సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా నియమించింది. వీరంతా ఇంటింటికీ వెళ్లి సర్వే చే శారు. ప్రతి కుటుంబం వివరాలు సేకరించా రు. 75 ప్రశ్నలున్న ధ్రువపత్రాల ద్వారా స మాచారం సేకరించారు. సర్వే క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు మండల అధికారులను సూపర్వైజర్లుగా నియమించారు. ఎన్యుమరేటర్లు చేసిన సర్వేను పర్యవేక్షిస్తూ కుటుంబాల వివరాలు నమోదు చేసిన ధ్రువపత్రాలను తనిఖీ చేసి రోజూ వారీగా ఉన్నతాధికారులకు నివేదించారు. అలాగే సర్వే వివరాలను వెబ్సైట్లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించింది.
సమగ్ర సర్వే చేసిన వారికి రూ.2,44,98,000 రావాల్సి ఉంది. వీటితో పాటుగా డాటా ఎంట్రీ చేసినందుకు రూ.73,92,714 రావాల్సి ఉంది. సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, వెబ్సైట్లో కుటుంబ వివరాలు నమోదు చేసిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారం నమోదు చేసినందుకు సుమారు రూ.25 చెల్లించాలని నిర్ణయించింది. సర్వే పూర్తయి ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పారితోషికం చెల్లించడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదించగా నిధుల లేమి కారణంగా ఆలస్యమవుతుందని, త్వరలోనే వారి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.