నార్నూర్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టారిత్యా చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని నార్నూర్ ఎస్సై అఖిల్ ( SI Akhil ) హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారిపై వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని సూచించారు. పెండింగ్ ఫైన్లను చెల్లించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహన చోదకులకు సూచించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.