కాసిపేట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ( Bellampalli) మండలంలోని సోమగూడెం పంచాయతీలో సర్పంచ్, వార్డు ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన ( BRS Supporters ) అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలాగౌడ్ ( Pramilagoud ) పిలుపు నిచ్చారు.
గురువారం బెల్లంపల్లి మండలం సోమగూడెం పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారురాలు కుక్క స్వరూప, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించి గెలిపించాలని కోరారు. తెలంగాణకు రక్ష బీఆర్ఎస్ పార్టీయేనని వెల్లడించారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని దీమాను వ్యక్తం చేశారు. ఈ నాయకులు రాంచందర్, శ్రీరాముల శ్రీను, సిలివేరి సుమలత, ఎండీ సల్మా, రంగు రవి తేజ, కుక్క రాంచందర్, మద్దెల శ్యామల, శ్యామ్, చిప్పకుర్తి పోశమ్మ, మంచాల మానస, బైరగోని సిద్దయ్య, ఉస్కమల్ల వివేక్, ఆదర్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.