ఆదిలాబాద్, ఫిబ్రవరి 5 ( నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పలుచోట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గౌరవప్రదమైన సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గల్లీ లీడర్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేని పరిస్థితుల్లో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
పాలన చేతకాని రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులు బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో సభ నిర్వహించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం మినహా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితంగా జిల్లా ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజల ఉపాధి మెరుగు పడిందని తెలిపారు.
బోథ్, ఫిబ్రవరి 5: బోథ్‌లో ఎమ్మెల్యే అ నిల్ జాదవ్ పిలుపు మేరకు సోమవారం బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొ మ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ముఖ్యమంత్రి విమర్శించడం సరికాదన్నారు. అసహనంతో సీ ఎం బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ డీ నారాయణ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, బోథ్ తాజా మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, జాదవ్ రోహిదాస్, మహిపాల్, హరీశ్, కొడప విజయ్, సురేశ్, రాంరెడ్డి పాల్గొన్నారు.