ఆస్తి కోసం ఘాతుకం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సిరిచెల్మ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం వానోలే ఈశ్వర్(32)ను ఇద్దరు వ్యక్తులు గొడ్డలి, కత్తులతో వెంబడించి మరీ దారుణ హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
- కత్తులు, గొడ్డళ్లతో వెంబడించి దారుణ హత్య
- వ్యవసాయ భూమి కోసం ఆరు నెలలుగా గొడువ
- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కలకలం
ఇచ్చోడ, డిసెంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సిరిచెల్మ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం వానోలే ఈశ్వర్(32)ను ఇద్దరు వ్యక్తులు గొడ్డలి, కత్తులతో వెంబడించి మరీ దారుణ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన లక్ష్మిబాయికి కేదోబా, పాండ్‌రంగ్ కుమారులు. ఈమె భర్త రామ్‌జీ పదేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో పెద్ద కుమారుడు కేదోబా(రిటైర్డ్ టీచర్) నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు పాండ్ రంగ్ కూడా ఇచ్చోడ మండలంలోని ఏడో నంబర్లో ఉంటున్నాడు. వీరి తల్లి పేరిట జాతీయ రహదారిని అనుకొని ఏడో నంబర్లో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇద్దరు కుమారులకు చెరో ఎకరం చొప్పున పంచి ఇచ్చింది. మిగతా ఎకరం తన పేరిట ఉంచుకున్నది. లక్ష్మీబాయి పెద్ద కుమారుడి వద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం కేదోబా కుమారుడు వానోలే ఈశ్వర్ పేరిట ఎకరం భూమి కూడా పట్టా చేసింది. అప్పటి నుంచి ఈశ్వర్‌కు పాండ్ రంగ్, ఆయన కుమారుడు సూర్యకాంత్‌తో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్దల వద్ద పంచాయతీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఈశ్వర్‌పై పాండ్ రంగ్, అతని కుమారుడు సూర్యకాంత్ పగ పెంచుకున్నారు. పథకం ప్రకారం వానోలే ఈశ్వర్‌ను మంగళవారం ఉదయం పాండురంగ్, సూర్యకాంత్ కలిసి సిరిచెల్మ చౌరస్తాలో వెంబడించి కత్తులు, గొడ్డలితో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని ఈశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పాండ్ రంగ్, సూర్యకాంత్ పారిపోగా.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈశ్వర్ భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈశ్వర్‌కు నాలుగేండ్ల కూతురు ఉంది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

