కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ ( BRS ) గెలుపు సంబరాలను ( Victory Celebrations ) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెద్దనపల్లి సర్పంచ్ గా కల్వల శరత్ కుమార్ గెలుపొందడంతో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

అనంతరం కాలనీల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి తన గెలుపు కోసం ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బొల్లు రమణారెడ్డి, నాయకులు గొంది వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, చింతల భీమయ్య, సుధాకర్ రెడ్డి, లంక లక్ష్మణ్, వెల్ది శ్రావణ్, బందరి వినయ్, శేఖర్, పులికోట వంశీ, రెడ్డి కనకయ్య, జీదుల లక్ష్మణ్, గాదం సంపత్, మహిళా నాయకులు రామ లక్ష్మీ, బచ్చల మనోహర, గుర్రం వజ్ర పాల్గొన్నారు.