కాసిపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు (BRS supporters) అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేసి అత్యధిక మెజార్టీ (Huge majority) తో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ కాసిపేట మేజర్ పంచాయతీ అధ్యక్షులు అగ్గి సత్తయ్య పిలుపు నిచ్చారు.
గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని కాసిపేట మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా ఉండి సర్పంచ్, వార్డు సభ్యుల పోటికి గుర్తింపు గల అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా అగ్గి సత్తయ్య మాట్లాడుతూ పార్టీ ఎవరికి మద్దతు తెలిపినా అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ మోటూరి వేణు, కుమ్మరి రాజేశం, కరీం, రమేష్, సత్రవేణి మల్లేష్, రేణుక, జమున, ఉస్కమల్ల గోపాల్, కేశవులు, శేఖర్, సుధాకర్, అక్కెపల్లి శ్రీను, పానగంటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.