బెజ్జూర్, నవంబర్ 22 : మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పర్యటించారు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణహిత నదిలో మునిగి చనిపోగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయమందించారు. అనంతరం కుశ్నపల్లికి చేరుకొని కార్యకర్తలతో మాట్లాడారు. అదే గ్రామంలో మాండూరి అనే వ్యక్తి ప్రమాదంలో గాయపడగా.. అతడిని కలిసి ధైర్యం చెప్పారు.
సలుగుపల్లి చౌరస్తాలో వెల్డింగ్ షాప్‌ను ప్రారంభించారు. లంబాడీగూడలో స్వెరోస్ స్టడీ సెంటర్‌ను ప్రారంభించారు. మర్తిడి గ్రామ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. పోతెపల్లిలో గ్రామస్తులు ఆర్ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వారితో కలిసి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కన్వీనర్ లెండుగురి శ్యాంరావు, నియోజకవర్గ కో కన్వీనర్ కొండా రాం ప్రసాద్, నాయకులు ఎంఏ కలీం, రాజ్ కుమార్, ఖాజా మోహినుద్దీన్, నికాడి మోహన్, బురుసు సారయ్య, దుర్గం తిరుపతి, రౌతు బాబురావు, యాకూ బ్, బాబు, ప్రకాశ్, ఫసీ పాల్గొన్నారు.