కాసిపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ కాసిపేట మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి ( Ramana Reddy ) పిలుపు నిచ్చారు. బుధవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటలో బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల అభ్యర్థుల గెలుపుపై దిశానిర్దేశం చేశారు. రమణారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఎవరికి మద్దతు తెలిపినా అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. నాయకుల మధ్య సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతీ నాయకుడిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మంజులారెడ్డి, మాజీ సర్పంచ్ అజ్మీర తిరుపతి నాయక్, ఏనుగు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాదవ్ గజానంద్, పెంద్రం హన్మంతు, మంగ శ్రీకాంత్, రాజాగౌడ్, దొంతుల తిరుపతి, రాజేష్, బాణాల సత్యనారాయణ, సక్రూ నాయక్, మంగ భీమయ్య, భీంరావు తదితరులు పాల్గొన్నారు.