నేరడిగొండ, ఆగస్టు 29 : బీఆర్ఎస్ పార్టీ బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌కు గ్రామా ల్లో జనాలు నీరాజనం పలుకుతున్నారు. మం డలంలోని కుమారి గ్రామంలో మంగళవారం ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. వీరతిలకం దిద్ది డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా గెలిపించుకుంటామన్నారు. మహిళలు మంగళహారతులతో ముందు నడువగా, పార్టీ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం గ్రామంలోని శబరిమాత ఆశ్రమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమ భక్తులు ఆయనను ఘనంగా స న్మానించారు. ముందుగా గ్రామంలోని బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. గ్రామంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా పరిష్కరిస్తానని జాదవ్ అనిల్ భరోసానిచ్చారు. సర్పంచ్ రాజుయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, మాజీ జడ్పీటీసీ గడ్డం భీంరెడ్డి, తర్నం సర్పంచ్ విశాల్‌కుమార్, ఎంపీటీసీ ఒర్స సరిత, నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, అరుణ్గౌడ్, కమలాకర్‌రెడ్డి, తులసీదాస్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, శబరిమాత భక్తులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
గుడిహత్నూర్, ఆగస్టు 29 : గుడిహత్నూర్ మండలం గురజ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్, బోథ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు మెట్టు అవినాష్ మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌ను నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో వారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అవినాశ్‌కు అనిల్ జాదవ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు యువకులు పార్టీలో చేరారు. సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు తిరుమల్‌గౌడ్, బేర దేవన్న, తెలంగే మాధవ్, జాదవ్ భీంరావ్ తదితరులున్నారు.
బజార్ హత్నూర్ మండలం నుంచి..
బజార్హత్నూర్, ఆగస్టు 29 : మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ శామన్పెల్లి శేఖర్ తన అనుచరులు 20 మందితో కలిసి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ జాదవ్ తన స్వగృహం నేరడిగొండలో శేఖర్‌కు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు నచ్చే పార్టీలోకి వచ్చామని వారు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్‌జాదవ్ గెలుపునకు కృషిచేస్తామని, భారీ మెజార్టీతో గెలుపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్, రోహిదాస్, సంతోష్, జైతు, బాలు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.