BRSV | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు నడిపిల్లి విజిత్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం రాత్రి బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుకుమార్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… మంచిర్యాలలో ప్రజాస్వామ్యం ఉందా..? లేదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 18 నెలల కాలంలో చాలా మందిని బెదిరిస్తూ, దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ లోపల వేసే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాలలో ఈ దాడులకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసేంత వరకు ధర్నా విరమించమని పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.