హాజీపూర్, మే 10 : తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి మండల కేంద్రంలోని ఓ ప్రైవే ట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి హాజరయ్యా రు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ రద్దు చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాధదవరపు జీవన్‌రావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు నయీం పాషా, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గొల్ల శ్రీనివాస్, ఎంపీటీసీ జాడి వెంకటేశ్, మాజీ సర్పంచ్‌లు జాడి సత్యం, నాయకులు మంచాల శ్రీనివాస్, లగిశెట్టి రాజయ్య, బేర పోచయ్య, గడ్డం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు..
దండేపల్లి,మే 10 : మండలంలోని ద్వారక గ్రామానికి చెందిన 70 మంది శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలన్నారు. కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. మాజీ జడ్పీటీసీ భూక్యా యశ్వంత్‌నాయక్ బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నాయకుడు విజిత్‌రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, నాయకులు వెంకటరమణ, వెంటకేశ్, రాజన్న, హరీశ్, అంజన్న పాల్గొన్నారు.