కుంటాల, మే, 21 : కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిందని, ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కిరణ్ కొమ్రేవార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని అర్లీ క్రాస్ రోడ్డు వద్ద పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కటింగ్ పేరిట ఎక్కువ ధాన్యం జోకుతుండడంతో రైతులు నష్టపోతున్నారని, రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని అన్నారు.
దీంతో మూడు వైపులా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడలీ వద్ద గందరగోళం నెలకున్నది. కాసేపటి తర్వాత భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని హమీ ఇవ్వడంతో నాయకులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో కుంటాల బీఆర్ఎస్ కన్వీనర్ దత్తు, బాసర మండల కన్వీనర్ శ్యామ్, నర్సాపూర్ కన్వీనర్ సుదాం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దశరథ్, మాజీ ఎంపీపీ రాజేశ్వర్, రావుల పోశెట్టి, రజనీకాంత్, వంశీ పాల్గొన్నారు.