Tandur | పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
Tandur | ప్రతిపక్షాల పర్యటనలను చూసి భయపడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తాండూర్ : ప్రతిపక్షాల పర్యటనలను చూసి భయపడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాండూర్ ( Tandur ) మండలంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీష్, బీఆర్ఎస్ నాయకుడు క్రాంతికుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆదివారం అరెస్టు చేసి మాదారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దార్శనికతతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పర్యటనను అడ్డుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు.
ముందస్తు అరెస్టులతో గొంతునొక్కాలని చూడటం వారి నిరంకుశ పాలనకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పోలీసుల నిర్బంధాలతో, అక్రమ అరెస్టులతో ప్రభుత్వం కాలం వెళ్లదీయాలని చూస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

