మంచిర్యాలటౌన్, డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదిన వేడుకలను శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీహర్ష కాలేజీ ఆవరణలో కేక్ కట్‌చేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, బీఆర్ఎస్ నాయకులు గొంగళ్ల శంకర్, బింగి ప్రవీణ్, ఆరె శ్రీనివాస్, పడాల రవీందర్, చిప్పకుర్తి జగన్, షకీల్, ఆనిల్, జమాల్ పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 22 : ఆర్కే-5కాలనీ బ్యారెక్స్‌లోని శ్రీసాయి వృద్ధుల ఆశ్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ యూత్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి.. మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. నాయకులు కాటం రాజు, సురేశ్, కుమార్, సాగర్, అనుదీప్ పాల్గొన్నారు.