తలమడుగు, జూలై 12: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్‌రెడ్డి అక్కసుతో ఉన్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై నిరసనగా బుధవారం తలమడుగులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల చావు కేకలు చూసి అల్లాడిపోయిన సీఎం కేసీఆర్ ఆ నాడు ఉన్న పదువులకు రాజీనామా చేసి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేశారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్‌కుమార్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మగ్గిడి ప్రకాశ్, ఎంపీటీసీ చంటి, మాధవరావ్, సర్పంచ్‌లు రాంబాయి, ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్, జూలై 12 : రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బోథ్‌లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్‌సింగ్, వైస్‌చైర్మన్ సంజీవ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఎలుక రాజు, లోలపు పోశెట్టి, రమణాగౌడ్, మహమూద్, మహ్మద్ రఫీ, సోమన్న, రమేశ్, ఎస్వీ రమణ, దేవ్‌రావ్, శంశోద్దీన్, సంఘపాల్, రఫీ పాల్గొన్నారు.
ముక్రా(కే)లో..
ఇచ్చోడ, జూలై 12: ముక్రా(కే) గ్రామంలో రైతులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని పాడేకట్టి శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసి వ్యవసాయ క్షేత్రంలో పిండ ప్రదానం చేశారు. కార్యక్రమంలో రైతులు రాము, చంపత్, శంకర్, గంగాధర్ పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏనుగుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుభాష్ పటేల్, రవీందర్, వెంకటేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
తాంసిలో..
తాంసి, జూలై 12: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలోబీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి, వైస్‌ఎంపీపీ ముచ్చ రేఖారఘు, సర్పంచ్‌లు స్వప్నారత్నప్రకాశ్, సదానందం, బీఆర్ఎస్ నాయకులు వెంకటరమణ, ధనుంజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రైతాంగానికి టీపీసీసీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలి
బోథ్, జులై 12: తెలంగాణ రైతాంగానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 90 శాతం వరకు మూడెకరాల రైతులకు 8 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం హస్యాస్పదమన్నారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను వంచించాలని చూస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే రైతులకు చీకటి రోజులు తప్పవన్నారు.
గుడిహత్నూర్‌లో..
గుడిహత్నూర్, జూలై 12: మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి రైతులకు వ్యతిరేకి
నేరడిగొండ, జూలై 12 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు వ్యతిరేకని జడ్పీటీసీ జాదవ్ అనిల్ విమర్శించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుంటే ఎనిమిది గంటలు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో గతంలో విపరీతంగా కరెంట్ కోతలు విధించి రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. ఇలాంటి పార్టీని ప్రజలు నమ్మవద్దని వచ్చే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు సయ్యద్ జహీర్, చంద్రశేఖర్‌యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్, వీడీసీ చైర్మన్ ఎలేటి రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ పండరి, నాయకులు రమేశ్, రాములు, మండాడి కృష్ణ, ప్రతాప్‌సింగ్, కరణ్‌సింగ్, మదన్‌సింగ్, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, జూలై 12 : మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, సర్పంచ్‌లు మడావి లింబాజీ, బాదర్, అజయ్, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాథోడ్ ఉత్తమ్, నాయకులు సంతోష్, నరేందర్‌యాదవ్, సంతోష్ , రైతులు పాల్గొన్నారు.