కాగజ్‌నగర్, జూలై 18: ‘సీఎం రేవంత్‌రెడ్డి గారూ.. సిర్పూర్ నియోజకవర్గంలోని పల్లెలు ప్రగతి లేక అధ్వానంగా మారాయి. వాటి అభివృద్ధి పట్టదా..? అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం చింతగూడ, కో యవాగు గ్రామాలను సందర్శించారు.
ఆయన మా ట్లాడుతూ గ్రామాల్లో సరైన డ్రైనేజీలు, రోడ్లు, గ్రామాలను అనుసంధానం చేసే బ్రిడ్జిలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారని మండిపడ్డా రు. పల్లెల్లో పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమలు వి జృంభించి రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ పట్టణంలో తాజ్‌బాబా ఉర్సు ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సర్‌సిల్క్ విజయబస్తి నుంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఉర్సు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు షారుఖ్ ఖాన్, ఉపాధ్యక్షుడు ఖలీమ్, కమిటీ ప్రతినిధులు వాజిద్, నదీం, అలీం పాల్గొన్నారు.