బోథ్, అక్టోబర్ 6 : టీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) ఏర్పాటుతో దేశంలో మార్పు తథ్య మని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బోథ్ మండలం ధన్నూర్ (బీ) గ్రామంలో కుచ్లా పూర్ క్రాస్‌రోడ్డు నుంచి ధన్నూర్ (బీ) మీదుగా పూర్తి స్థాయిలో రూ 6.52 కోట్ల నిధులతో చేపడుతున్న అడెల్లి రోడ్డు నిర్మాణ పనులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి గురువారం శంకు స్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో దేశంలో చర్చ మొదలైంద న్నారు. 14 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిదేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేసి చూపించారన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే తమకు తెలంగాణలో అమలవు తున్న పథకాలు అందుతాయని దేశ ప్రజలు ఆశిస్తున్నారని తెలిపా రు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ అడెల్లి రోడ్డు ఒకప్పుడు కలగా ఉండేదని, ఇప్పుడు సాకారం అవుతుందని పేర్కొన్నారు. బోథ్‌లో డిగ్రీ కళాశాల, ఆర్డీవో కార్యాలయం, డీఎస్పీ (ఇచ్చోడ)లో ఏర్పాటు చేయిస్తామన్నారు. ధన్నూ ర్ (బీ), నక్కలవాడ వాగుల వంతెనల నిర్మాణం కోసం త్వరలోనే నిధులు మంజూరుకానున్నాయ ని పేర్కొన్నారు. ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీ టీసీ ఆర్ సంధ్యారాణి, సర్పంచ్ జీ గంగాధర్, ఎంపీటీసీ డీ నారాయణరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, బోథ్ సర్పంచ్ జీ సురేందర్‌యాదవ్, రైతు బంధు సమితి అధ్యక్షు డు జగన్మోహన్రెడ్డి, బోథ్ సహకార సంఘం చైర్మన్ కే ప్రశాంత్, టీఆర్ ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మణ్‌సింగ్, జడ్పీకో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, నేరడిగొండ ఎంపీపీ రాథోడ్ సజన్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తూ ధన్నూర్ (బీ)లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాలాభిషేకం చేశారు. బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ధన్నూర్ (బీ) గ్రామస్తులు ఏర్పాటు చేసిన పాలాభిషేకంలో పాల్గొన్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యా రాణి, స్థానిక సర్పంచ్ జీ గంగాధర్, ఎంపీటీసీ డీ నారాయణరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎన్ జగన్మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.