మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 1: తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రబోధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విచారణ పేరిట సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసం నుంచి బయలుదేరిన బైక్‌ర్యాలీ ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర టాకీసు, అర్చనటెక్స్ చౌరస్తా, మార్కెట్‌రోడ్, బస్టాండు మీదుగా కొనసాగింది. దారి పొడవునా కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన’ అంటూ నినదించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.
దండేపల్లి, ఫిబ్రవరి 1:దండేపల్లిలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, అక్కల రవి, బీఆర్ఎస్ నాయకులు రేని శ్రీనివాస్, వెంకటరమణ, ముద్దసాని తిరుపతి, నజీర్, ఉస్మాన్ ఖాన్, బచ్చల అంజన్న, హరీశ్, బొమ్మెన మహేశ్, తిరుపతి, సుధాకర్, తదితరులు ఉన్నారు.
హాజీపూర్, ఫిబ్రవరి 1 : హాజీపూర్‌లోని బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. బైక్ ర్యాలీ తీసి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, హాజీపూర్ సర్పంచ్ మాధవరపు శ్రీలత-రామారావు, హాజీపూర్ మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గోళ్ల శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు అసాధి ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జన్నారం, ఫిబ్రవరి 1 : జన్నారం మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అతీఖాన్,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పేరం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జాడి గంగాధర్, టౌన్ అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌గౌడ్, దుమల్ల ఎల్లయ్య, ఫజల్‌ఖాన్, మహిళ అధ్యక్షురాలు సుశీల, బోర్లకుంట ప్రభుదాస్, శివ, చెట్పెల్లి సత్యం, రాజునాయక్, రాములునాయక్, భరత్‌నాయక్, మేకల అక్షయ్, జునుగూరి మల్లయ్య, అడెపు లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, ఫిబ్రవరి 1: లక్షెట్టిపేట పాత బస్టాండ్ నుంచి ఉతూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ తీశారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిప్పని లింగన్న, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, తొగరి కాంతయ్య, చుంచు తిరుపతి, సతీశ్‌రెడ్డి, షేక్ చాంద్, ఓరగంటి శ్రీకాంత్, చిప్పకుర్తి నారాయణ, మర్రిశెట్టి సుమన్, దర్శనాల నవీన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో..ప్రజాగ్రహానికి భస్మం కాక తప్పదు
బెల్లంపల్లి, ఫిబ్రవరి 1 : సిట్ విచారణ పేరిట కేసీఆర్‌ను ఇబ్బందులకు గురి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురై భస్మం కాక తప్పదని కాంగ్రెస్ సర్కారుపై మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు గోగుల రవీందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఏఎంసీ చౌరస్తా, కాంటా చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా కొత్తబస్టాండ్ వరకు బైక్ ర్యాలీ తీశారు. ఈ నిరసనలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
నెన్నెల, ఫిబ్రవరి 1: నెన్నెల మండలంలో గొల్లపల్లిలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. నెన్నెల మండల కేంద్రంలో ప్రధానరోడ్డుపై నిరసన చేపట్టారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను పోలీసులు పట్టుకెళ్లారు. అనంతరం నాయకులు బైక్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్, బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఇబ్రహీం, మధుకర్, దుగుట చంద్రయ్య, జాడి లక్ష్మి, గురునాథం సుమలత, ఓరం కమల, నారాయణ,మాజీ సర్పంచ్‌లు, బాపు, మల్లేశ్, మోహన్, మసూద్ ఖాన్, పూదరి అంజన్న, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, ఫిబ్రవరి 1 : కాసిపేట మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాసిపేటలోని అంబేదర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. దేవాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. రాస్తారోకో చేపట్టి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపూర్ యాపలో నల్ల బ్యాడ్జిలు ధరించి ధర్నా చేపట్టి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఆత్రం మహేశ్, సింగని రాజ్‌కుమార్, గోనె రవి, కైలాష్, అటకపురం రమేశ్, మచ్చ అనిల్, కొంగ విజయ్, అఫ్జల్, వెంకటేశ్, శ్రావణ్, దేవాజీ, దుర్గం రాజేశ్, లవన్, గిరి, ఖదీర్, హైదర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాసిపేటలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, నాయకులు రాంటెంకి వాసుదేవ్, జాడి రాంచందర్, సత్రవేణి మల్లేశ్, లంక లక్ష్మణ్, అంజన్న, సూర్య ప్రకాశ్, మోహన్ సురేశ్, శ్రీనివాస్ ఉదయ్, ప్రశాంత్ వినాయ్, విజయ్, ప్రసాద్, చరణ్, రమేశ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్ లో మాజీ సర్పంచ్ అజ్మీరా తిరుపతి, ఏనుగు సుధాకర్ రెడ్డి, బాసవేణి కొమురయ్య, శ్యాం తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, ఫిబ్రవరి 1 : తాండూర్ ఐబీ కేంద్రంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ ప్రణయ్, ఉప సర్పంచ్ గట్టు సంతోష్, మాజీ ఎంపీటీసీలు శంకర్, నారాయణ, నాయకులు చంద్రశేఖర్, రాజన్న, బోడ సతీష్, మణి కుమార్, దుర్గం శ్రీను, ఎల రాంచందర్, చింటూ, బాబూ ఖాన్, భరత్, బాలు.. వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
కన్నెపల్లి, ఫిబ్రవరి 1 : కన్నెపల్లి మండల కేంద్రంలోని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శాంత బాపు, రవి, నాయకులు ఆకుతోట రాజన్న, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు జిల్లెల్ల మహేశ్‌గౌడ్, నాయకులు గణేశ్, అశోక్, రాములు, రవి, మంగయ్య, భీమన్న, మొండన్న, దేవాజీ, ప్రసాద్, రాజు, సంతోష్, పున్నం తదితరులున్నారు.
వేమనపల్లి, ఫిబ్రవరి 1 : వేమనపల్లి లో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, సుధాకర్, నాయకులు మధుకర్, వెంకటేశ్, గొంతుమేర, సంతోష్, బాపు, రమేశ్, అంజన్న, రవి, లక్ష్మణ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలో..
చెన్నూర్, ఫిబ్రవరి 1: చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఉదయమే హౌజ్ అరెస్టు చేసినప్పట్టికీ, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ర్యాలీగా తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తాకు వచ్చి రాస్తారోకో చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి వెళ్లగొట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మాజీ కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, ఏల్పులు సుధాకర్, దొమకొండ అనీల్, బీఆర్ఎస్ నాయకులు కొండపర్తి వెంకటరాజం, నయాబ్, ప్రశాంత్, తలారి మురళి, వీరమల్ల రాము, గడిపల్లి సంతోష్, శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఫిబ్రవరి 1 : కోటపల్లి మండలంలో పారుపల్లి గ్రామం సమీపంలోని జాతీయ రహదారి నెం. 63 పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భైఠాయించారు. ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధంకు బీఆర్ఎస్ శ్రేణులు యంత్నించగా పోలీస్‌లు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, మండల నాయకులు పెద్దపోలు సాంబాగౌడ్, పిల్లి సమ్మయ్య, పడాల శ్రీనివాస్, కొట్టె నారాయణ, తిరుపతి రావ్, గజ్జల చంద్రు, కామ శ్రీనివాస్, ఆసంపల్లి సంపత్ కుమార్, పూరెళ్ళ మహేష్, సాదిక్, గుగ్లోత్ బాపు నాయక్, కొడిశెట్టి రాజు, అస్తబాపు, బోగు భూమయ్య, మాంతయ్య తదితరులు పాల్గొన్నారు. లింగన్నపేట, నాగంపేట, మల్లంపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎరనాగుల ఓదెలు, నాయకులున్నారు. రొయ్యలపల్లిలో సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు.
భీమారం, ఫిబ్రవరి 1 : భీమారంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్, ధర్మారం సర్పంచ్ మణి దీపక్, నాయకులు జనంపల్లి సమ్మయ్య, వెంకన్న, సూరం గిరిదన్ రెడ్డి, కుంబ్ర బబ్లూ, భూక్యా రాజ్ కుమార్ నాయక్, నీలాల తిరుపతి, సుంకరి గోపాల్, బోగి విశాల్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 1: బీఆర్ఎస్ యూత్ చెన్నూర్ మండల అధ్యక్షుడు తాటి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, నాయకులు నరసింహ చారి, తదితరులున్నారు.
మందమర్రి, ఫిబ్రవరి 1: మందమర్రిలోని పాతబస్టాండ్ ఏరియా జయశంకర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నల్ల కండువాలను ధరించి నిరసన తెలిపి రాస్తారోకో చేశారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. పట్టణ ఎస్ఐ నరేశ్ సిబ్బందితో వచ్చి వారిని చెదరగొట్టారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, పట్టణ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ బండారు సూరిబాబు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. వెంకటాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సెగ్యం వెంకటేశ్, నాయకులు నారాయణరావు, సుగుణాకర్‌రావు, సుద్దుల నరేందర్, సురేశ్, చిరంజీవి, సతీశ్, పవన్, రవి తదితరులు పాల్గొన్నారు.
జైపూర్, ఫిబ్రవరి 1 : జైపూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 1: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి రామాలయం చౌరస్తా నుంచి సూపర్ సెంటర్ మీదుగా రాజీవ్‌చౌక్, అక్కడి నుంచి తిరిగి సూపర్ బజార్ సెంటర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ తీసి నిరసన తెలిపారు. నిరసనలో నియోజకవర్గం నాయకులు డా. రాజారమేశ్, పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్, మాజీ సర్పంచ్ జాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, బీ. అనిల్ రావు, పోగుల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..సిట్ నోటీసులు బూటకం..
ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 1: ఫోన్ టాపింగ్ నెపంతో కేసీఆర్ ను విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన సిట్ నోటీసులు బూటకం అని మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌కుమార్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సిట్ నోటీసులను దగ్ధం చేశారు. అనంతరం ర్యాలీగా బీఆర్ఎస్ భవన్ చేరుకుని నల్ల జెండాను ఎగురవేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
సిర్పూర్(యూ)ఫిబ్రవరి 1: సిర్పూర్(యూ)లోని ప్రధాన చౌరాస్తాలో, పెట్రోలు బంకు సమీపంలో బీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావు, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు తొడసం ధర్మరావు, మాజీ ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచులు కోవ నాందేవ్, అర్క నాగోరావు, ప్రహ్లాద్, మాజీ ఎంపీటీసీ గేడం మారుతి కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని రాఘపూర్లో మాజీ సర్పంచ్ కోవ నాందేవ్ ఆధ్వర్యంలో, నేట్నూర్లో మాజీ సర్పంచు అర్క నాగోరావు యువకులతో కలిసి నిరసన తెలిపారు.
లింగాపూర్ మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ప్రధాన చౌరస్తా వద్ద రోడు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుంనూర్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కంచనపల్లిలో రోడు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ ఆడే లక్యానాయక్, మాజీ వైస్ ఎంపీపీ జాదవ్ గణపతి నాయక్, కిషన్ నాయక్, బాపురావు, మాజీ ఎంపీపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జైనూర్ ఫిబ్రవరి 1: జైనూర్తో పాటు, జామ్ని, పానాపటార్, గుడమామడ, మాన్కుగూడ, ధబోలి, పట్నాపూర్, శివ్నుర్ గ్రామాల్లో ముఖానికి నల్ల రంగు వస్ర్తాన్ని కట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాధోరావ్, మాజీ ప్యాక్స్ చైర్మన్ కోడప హన్ను పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్‌లాలా, ఉపాధ్యక్షుడు కోలాం శంకర్, సర్పంచులు ఆత్రం తులసి-శంకర్ కొలాం, జాదవ్ శ్రావణ్,మడావి కౌసల్యాబాయి-భీంరావ్, కుమ్ర యశోద-కేశవ్,యువ నాయకులు ముండే సతీష్, మెస్రం రాహుల్, శంకర్ , విశాల్ కెంద్రె,ఆత్రం భగ్వంత్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి ఫిబ్రవరి 1: తిర్యాణిలో నల్ల బ్యాడ్జిలు ధరించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు వెడ్మ కమల చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమాండ్ల జగదీశ్, పీఏసీఎస్ చైర్మన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు ముత్యం రాజయ్య, గాయంగి మల్లేశ్, మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గణపత్రావు, చింతపల్లి, మొర్రిగూడ గోయగాం, గడలపల్లి, సర్పంచులు చిక్రం కృష్ణ, జంగు, భీము, శంకరమ్మ, ఆయా గ్రామాల కార్యకర్తలు నాయకులు తదితరులున్నారు.
రెబ్బెన, ఫిబ్రవరి 1: రెబ్బెన మండల కేంద్రంలో నల్లబ్యాడ్జిలు, కండువాలు ధరించి, నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ రంగు మహేశ్‌గౌడ్, సర్పంచ్‌లు దుర్గం భరద్వాజ్, ఎర్గటి సుధాకర్, ఉపసర్పంచ్ వరలక్ష్మి, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ కుందారపు శంకరమ్మ, మాజీ ఎంపీటీసీ సంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు బొమ్మినేని అహల్యాదేవి, బుర్స పోషమల్లు, మాజీ డైరక్టర్ ఇంగు మల్లేశ్, మహిళా నాయకులు మన్యం పద్మ, అన్నపూర్ణ అరుణ, అలకటి పద్మ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాపర్తి అశోక్, బీఆర్ఎస్ నాయకులు దుర్గరావు, గోగర్ల రాజేశ్, బబ్బు, సాయికిరణ్ తదితరులున్నారు.
నగదుతో దొరికిన అసలు దొంగ రేవంతే..
కెరమెరి, ఫిబ్రవరి 1: ఓటుకు నోటు కేసులో రూ.50వేల నగదుతో అడ్డంగా దొరికిన అసలు దొంగ సీఎం రేవంత్‌రెడ్డినేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ సయ్యద్ అబూల్ కలాం, పార్టీ మండలాధ్యక్షుడు రాథోడ్ అంబాజీ ఆరోపించారు. కేసీఆర్‌కు నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం కెరమెరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నల్ల జెండాలు, బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దుర్పతబాయి, సర్పంచులు పెందోర్ ఆనందరావు, కుమ్రం అంబారావు, కుడ్మేత కొద్దు, చోలే నాగనాథ్, బుచ్చయ్య, మాజీ సర్పంచులు తొడసం జగన్నాథ్, కుడ్మేత సోము, నాయకులు షేక్ యునుస్, రూప్‌లాల్, దందురావ్, నిసార్ అహ్మద్, గుజ్జుల వెంకటేశ్, మున్ను, బాలాజీ, కంబాల వినేష్, శ్రీరామ్, సోనాజీ, ఉమేష్, ముజీబ్, రాంచందర్, పోశం, తుకారాం, భీంరావు, తిరుపతి, జావీద్ కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలో..
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 1: కాగజ్‌నగర్ మండలంలోని కోసిని గ్రామ పంచాయతీలో పరిధిలోని సిర్పూర్ (టీ) మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు కొంగ సత్యనారాయణ, నాయకులు నరేందర్, పోశం, కోసిని గ్రామస్తులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 1: చింతలమానేపల్లి మండలకేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాజీమ్ హుస్సేన్, జునుగరిశేఖర్, దరి చందు, డోకె శ్రీనివాస్, రాఘవ రెడ్డి, రౌతు దేవాజీ, నిట్టూరి సత్యాన్న, జబరి భాసర్, టుస్సే రవి, నీల గౌడ్, రత్నం పాపయ్య, బొరుట్ సోమయ్య, సందీప్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలున్నారు
దహెగాం,ఫిబ్రవరి 1: మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సర్పంచ్ వెల్ములే ప్రశాంత్, నాయకులు కంబగౌని సంతోష్‌గౌడ్, సంగర్స్ బాలకిషన్‌రావు, బండ కృష్ణ, ప్రసాద్‌రాజు, జర్పుల కృష్ణ, తమ్మిడె మల్లేశ్, చెమ్మకారి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పెంచికల్పేట్, ఫిబ్రవరి 1 : మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్, మండల మాజీ కో ఆప్షన్ సాజిత్, మాజీ సర్పంచ్ జాజిమొగ్గ శ్రీనివాస్, నాయకులు బండి వెంకటాచలం, రాజేశ్వర్,వెంకన్న, భీమయ్య,మహేశ్, నరేశ్, పాండు, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూర్, ఫిబ్రవరి 1 : మండల కేంద్రంలో నల్ల జెండాతో ఆదివాసీ భవనం నుంచి వారసంత వరకు ర్యాలీ తీసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కుర్సింగ ఓంప్రకాశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిడం సాకారాం, సర్పంచ్‌లు సోయం చిన్నయ్య, ఎన్క శ్రీహరి, తలండి నాగేశ్, నాయకులు బషరాత్ ఖాన్, అమీరుద్దీన్, జావిద్ అలీ ఖాన్, దందెర ఇస్తారి, లంగారి శ్రీనివాస్, బుజాడి శేఖర్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 1: నస్పూర్ ఏరియా కృష్ణాకాలనీ మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బెడిక లక్షి తన అనుచరులతో కలిసి ఆదివారం బీఆర్ఎస్లో చేరగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కండువా కప్పి స్వాగతం పలికారు. మాజీ కౌన్సిలర్ పంబాల గంగా ఎర్రయ్య, వంగ తిరుపతి ఆధ్వర్యంలో బెడిక లక్షి తన భర్త సమ్మయ్య, అనుచరులు 50 మందితో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజీత్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేష్, మాజీ సర్పంచ్ తిప్పని రామయ్య, టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, గౌస్, జక్కుల కుమార్, ముక్కెర వెంకటేష్, పాదం శ్రీనివాస్, కాటం రాజు, దగ్గుల మధు, గొర్ల సంతోష్ పాల్గొన్నారు.