ఎదులాపురం, ఫిబ్రవరి 13 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో పదవీకాలం పూర్తి చేసుకున్న పార్టీ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల సర్పంచ్లకు రామన్న శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు సహనం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేస్తామని ప్రకటనలు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రమేశ్, గోవర్ధన్, డీసీసీబీ డైరెక్టర్ పరమేశ్వర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సీనియర్ నాయకులు రోకండ్ల రమేశ్, కుమ్ర రాజు, లింగారెడ్డి, సాజీదొద్దీన్, గంభీర్ ఠాక్రె, సతీశ్ పవర్, రాజన్న, మాజీ సర్పంచ్లు పెందూర్ గంగారం, విలాస్, భూమన్న, విఠల్, ఇందుబాయి ఉన్నారు.