నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని త్రిరత్న బుద్ధవిహార్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని( Indian Constitution Day ) దళితులు బుధవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్( BR Ambedkar ) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ దళితులకు, బీసీలకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగంలో సముచిత న్యాయం కల్పించిన మహోన్నతమైన వ్యక్తని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, మాజీ జట్పీటీసీ హేమలత బ్రిజ్జిలాల్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోకండే చంద్రశేఖర్,దుర్గే రుక్మాబాయి, లోకండే దేవ్ రావు, ప్రకాష్, దయానంద్, సునీల్, కేశవ్ తదితరులున్నారు.