బోథ్, అక్టోబర్ 14 : కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే బాగుండేనని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా రహెమత్నగర్ డివిజన్, కార్మికనగర్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నోట కేసీఆర్ మాటే వినిపిస్తుందన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందిన పథకాలను గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే మాగంటి సునీత గోపీనాథ్ విజయం తథ్యమన్నారు. ప్రచారంలో బోథ్ నియోజకవర్గం పరిధిలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం బూత్ కన్వీనర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి ప్రచార తీరును వారికి వివరించారు.