ఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వ్యక్తి మా జీమంత్రి జోగు రామన్న అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శుక్రవారం ఆదిలాబాద్లో మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జన్మదిన వేడుకలు నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత జోగు రామన్నకు దక్కుతుందన్నారు. పుట్టిన రోజు సందర్భంగా జోగు రామన్న వివిధ ఆలయాల్లో పూజలు చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేయగా, 465 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బేల, జూలై 4 : మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ బేల మండల నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తె లిపారు. మండలానికి చెందిన నేతలు ఆదిలా బాద్లోని ఎస్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు.
వందల సం ఖ్యలో కార్యకర్తలు రక్తదానంలో పాల్గొని సేవా దృక్పథాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, జకుల మధుకర్, మాస్ తేజ్రావ్, సంతోష్, విపిన్, బత్తుల సుదర్శన్, బద్దం ప్రకాశ్ రెడ్డి, గోడే మధుకర్, తాన్ బా ఠాక్రే, వైద్య కిషన్ రావ్, విశాల్, సదిక్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.