తలమడుగు, జూన్ 6 : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కుచులాపూర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ పల్లెకు వెళ్లినా ఏ వాడకు వెళ్లినా మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలంటున్నారని అన్నారు. తమకు సమయానికి రైతు బంధు వేయాలని వేడుకుంటున్నారన్నారు.
కనీసం 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో నూతన సబ్స్టేషన్ నిర్మాణంతోపాటు కుచులాపూర్ టూ తలమడుగు రోడ్డు పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే చేపడుతామన్నారు.
పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనార్దన్, పార్టీ కన్వీనర్ వెంకటేశ్, ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అభిరాంరెడ్డి, కిరణ్, మాజీ సర్పంచ్ దేవ్రావ్, తోట శ్రీనివాస్, వామన్, రవీందర్, మల్లయ్య, రవికాంత్ యాదవ్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.