బజార్హత్నూర్ అక్టోబర్ 30: మాయమాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే.. ఇగ కరెంట్ ఖతమే.. మళ్లీ పాత కథే అవుతుందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సూచించారు. మండలంలోని కొల్హారి, భూతాయి, చందూనాయక్ తండా, వంజార భూతాయి, కొలాంగూడ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా ఆయా గ్రామాల్లోని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముందుగా కొల్హారి గ్రామంలో పర్యటించి గ్రామంలోని వాడవాడల్లో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వనికే పట్టం కట్టాలని ఆయన కోరారు.
అనంతరం చందూనాయక్ తండా వెళ్తున్న రోడ్డు మార్గం గుండా జాతర్ల గ్రామ సమీపంలోని పంట పొలాల్లోని రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలది అధికార యావ అయితే బీఆర్ఎస్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని స్పష్టం చేశారు. పోరాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ఆభివృద్ధి చేశారని, కేసీఆర్ పాలనలో ప్రజ ల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. అ
న్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. ప్రజలు కారు గుర్తుకే ఓటు వేసేందుకు రెడీగా ఉన్నారని, ప్రజా ఆశీర్వాద యాత్రనే ఇందుకు నిదర్శనమన్నారు. చందునాయక్‌తండా, వంజారభూతాయి, కోలాంగూడ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగ, అనిత, జ్ఞానేశ్వర్, సాయన్న, పీఏసీఎస్ చైర్మన్ వెంకన్న, నాయకులు నానం రమణ, చిల్కూరి భూమయ్య, చట్ల గజ్జయ్య, కొత్త శంకర్, దీశి రమణ, పవన్‌కుమార్, ప్రశాంత్ మహారాజ్, అల్కెగణేశ్, మడిగే రమణ, బొడ్డు శ్రీనివాస్, మడిగే రమేశ్, తండ్రా శ్రీనివాస్, నారడి మల్లేశ్, భోజన్న, అజయ్, జనార్దన్, యోగి, మునేశ్వర్ నారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.మండలంలోని సుంగుగూడ, చిన్నమియా తండా గ్రామానికి చెందిన గ్రామ పటేళ్లు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.