కోటపల్లి, ఏప్రిల్ 15 : షట్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, గత నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో దాహం తీరేదెట్లా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని ఇటీవల ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించారు.
ఎస్సీ కాలనీలో బోరుబావి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించగా, మంగళవారం పనులను ప్రారంభించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు ఎస్సీ కాలనీ వాసులు కృతజ్ఙతలు తెలిపారు.