తాంసి : ఆషాడం మాసం బోనాల పండుగ సందర్భంగా తాంసి మండలం (Tamsi Mandal) అకాడి బోనాలను (Bonalu ) భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. మండలంలోని పొన్నారి హస్నాపూర్, పాలోడి, గోట్కూరి ,జామిడి, బండల్ నాగాపూర్,వడ్డాడి, కప్పర్లలో ఆదివారం అకాడిని నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక దేవతలకు నైవేద్యాలను సమర్పించారు.
ప్రత్యేకంగా పెద్ద పోచమ్మ, మంద పోచమ్మ, ముత్యాలమ్మ, ఆరెళ్లి మైసమ్మల కోసం ఆభరణాలను అలంకరించి ఆలయాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దలు, యువత, మహిళలు , చిన్నపిల్లలు సైతం సంప్రదాయ వేషధారణలో భాగమై బోనాలు ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, పూజారులు ప్రత్యేకంగా పంచాంగ పఠనం, హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.