భీమారం, మర్చి 8 : ‘కాంగ్రెసోళ్లు మా కాలనీ లో వేసే బోరును ఆపేసి.. వేరే చోటికి తీసుక పోయిన్రు. తాగు నీటికి మస్తు తిప్ప లైతంది. మా గోస చూసి ఇక్కడ బోరు వేయిం చాలె’.. అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఇప్పలబోగుడ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నీటి ఎద్దడి ఉన్న చోట బోర్లు మంజూరు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఇప్పల బోగుడకు బోర్వెల్ వచ్చింది.
కాలనీ వాసులు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభిం చారు. గంట తర్వాత భీమారం కాంగ్రెస్‌లోని మరో వర్గం వచ్చి ఆపేశారని, తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకుడు పోడెటి రవి దృష్టికి తీసుకెళ్లగా, బోర్ను ఎమ్మెల్యే వివేక్ మంజూరు చేయించారని, మరో వర్గం వచ్చి ఆపడ మేమిటని ప్రశ్నించారు. స్థానికులు భీమేశ్, నాగరాజు, సారయ్య, రవి, కిరణ్, రాజమల్లు, రజిత, నాగమణి, ఇస్లావత్ యమున ఉన్నారు.