నేరడిగొండ, జనవరి 2 : ఏం అవ్వా…కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎ ట్లుంది..? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 4000 రూ పాయల పింఛన్ వస్తుందా..? అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ బీడీ కార్మికులను ప్రశ్నించారు. గురువారం మండలంలోని కుమారి గ్రామం లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో బీడీలు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి వారిని సరదాగా పలకరించారు.
బీడీ కార్మికులకు కాంగ్రె స్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.4000 పింఛన్ వస్తుందా ? అని అడిగారు. వారు రావడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత ్తమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని..అప్పుడు ఇచ్చిన రూ.2000 లే ఇస్తున్నారని.. మాకు రూ.4000ల పింఛన్ ఇప్పించండి సారూ..’ అని బీడీకార్మికులు ఎమ్మెల్యేకు విన్నవించారు.
మండలంలోని కుప్టి గ్రామంలోని కేసీఆర్ పార్కులో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ మొక్కలు నాటారు. తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త కొయ్యడి గంగయ్య ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కుమారి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కమలాకర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని పరామర్శించారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిరుమల్‌గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్, నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, మాజీ సర్పంచ్ పాండురంగ్, ప్రతాప్‌సింగ్ పాల్గొన్నారు.