ఆదిలాబాద్ : మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు ( KCR’s birthday) సందర్భంగా సోమవారం బోథ్ ఎమ్మెల్యే (BOth MLA) అనిల్ జాదవ్ (Anil Jadav) ఆధ్వర్యంలో నేరడిగొండలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం చేస్తూ ప్రతీ ఒక్కరు కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన వచ్చిందని, నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల నుండి 700 పైచిలుకు మంది రక్తదానం చేశారని పేర్కొన్నారు. రక్తదాన శిబిరానికి వచ్చిన స్పందనను చూస్తుంటే ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారని అర్థమవుతుందని అన్నారు.