ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆదివారం సోయాబిన్ కొనుగోళ్లను స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా సేకరణ చేపట్టారు. సోయాబిన్ అమ్మకానికి వందలాది మంది ఎదురు చూస్తుండగా.. ముందుగా ఎంపిక చేసిన ఒకరిద్దరు రైతుల నుంచి పంటను నామమాత్రంగా కొనుగోలు చేసి బంద్ చేశారు.
మంగళవారం సోయా కేంద్రం ప్రారంభించిన స్థలంలో రైతులు మక్కలను ఆరబెడుతున్నారు. సోయా కొనుగోళ్లు నెలరోజులు ఆలస్యంగా ప్రారంభించినా.. పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు అంటున్నారు. ఇలా ఎమ్మెల్యే ప్రారంభించి అలా ఆపేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే మద్దతు ధరలో కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
– నమస్తే తెలంగాణ ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్.