తాండూర్ : భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీలో తాండూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులకు స్థానం దక్కింది. ఈ సందర్భంగా బీజేపీ( BJP ) జిల్లా కార్యదర్శిగా రామగౌని మహిధర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధం మల్లేష్, సంఘర్స్ శీతల్ ఎంపికయ్యారు. ఆదివారం వారిని శాలువాలతో సత్కరించి సన్మానించారు. తాండూర్ మండల ప్రధాన కార్యదర్శులుగా నియామకమైన పుట్ట కుమార్, మామిడి విగ్నేష్, మండల కార్యదర్శి గాదె రాజేశంను సన్మానించారు.
ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దూడపాక భరత్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి, పులగం తిరుపతి, సీనియర్ నాయకులు మద్దర్ల శ్రీనివాస్, కేశెట్టి విజయ్, మండల కోశాధికారి రాచర్ల సురేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికల శంకర్, మండల కార్యవర్గ సభ్యులు ఆవుల చందు, ఎనగందుల తిరుమలేష్, సదాల శివ, చిలువేరు శాంతన్ కుమార్, చిలువేరు శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.