తాండూర్ : బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు ( Suicide) కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తాండూర్ మండల కేంద్రం ఐబీ సెంటర్లో రాస్తారోకో (BJP Protest ) నిర్వహించారు. వేమనపల్లి ఎస్సైను సస్పెండ్ చేయాలని , బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న బీజేపీపై కక్ష సాధింపు చర్యలో భాగంగా మండల అధ్యక్షుడు పై అక్రమంగా కేసు బనాయించి ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి రామగౌని మహీధర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి, పులగం తిరుపతి, తుకారం, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధం మల్లేష్, సీతాల్, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, మండల కార్యదర్శి గాదే రాజేశం, నాయకులు పాల్గొన్నారు.