బేల, నవంబర్ 13 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్ మండలం మేడిగూడకు చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ కుదుర్ గంగాధర్, వార్డు మెంబర్ దాసరి వినోద్ బీజేపీని వీడి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కండువా కప్పుకున్నారు. ఈ సంద ర్భంగా వారి కాంగ్రెస్, బీజేపీకి చెందిన దాదాపు 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ఇప్పట్లో ఎలాంటి ఎన్నిక లు లేకున్నా కొంత మంది బీజేపీ నాయకులు పోటీపడి ఆదివాసీ గ్రామాల్లో ఎన్నికల వాతావ రణం సృష్టించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఆదివాసీ గూడెం, తండాలకు బీటీరోడ్లు, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించింది తెలంగాణ ప్రభుత్వ మని తెలిపారు. తాగునీటి సమస్యలు తలెత్త కుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని, అంటు వ్యాదులు ప్రబలకుండా ఆదివాసులకు అవసర మైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొ న్నారు. త్వరలో 45 లక్షల మందికి పోడు భూము లకు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ అడ్ఢి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల వెంకట్రెడ్డి, సర్పంచ్ సీమ మడిపాటి, ఎంపీటీసీ దేవన్న, నాయకులు ఇజ్జగిరి నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లవేళలా అండగా ఉంటా..
ఎదులాపురం, నవంబర్ 13 : మున్నూరు కాపు సంఘానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్నూరుకాపు సంఘ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు. తాలుకా మున్నూర్ కాపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాళ్ల విఠల్, కలల శ్రీనివాస్, కోశా ధికారి జైపాల్, జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, మహిళా సంఘం నాయకులు మమతా ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 13 : ముదిరాజ్ కులస్తుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ఎమ్మెల్యే హాజరై మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 21న తెలంగాణ ముది రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించి నిర్వహిం చనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సంఘం సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు. వినతి పత్రాన్ని అందజేశారు.