కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : కలకలం రేపుతున్న బర్డ్‌ప్లూ నివారణ చర్యల్లో భాగంగా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన వాంకిడితో పాటు సిర్పూర్-టీ మండలంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నది. ఇక జిల్లా కేంద్రంలోని మాంసం మార్కెట్ సమీపంలో వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతోంది. సిబ్బంది స్పందించి కూరగాయల మార్కెట్ పక్కనే పడేస్తున్న మాంసం వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.