ఖానాపూర్, జూన్ 3 : అమెరికా దేశంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా ముగిశాయి. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ టెక్సాస్‌లో పర్యటించారు.
అక్కడ మహాత్మాగాంధీ మెమోరియాల్ ప్లాజాను సందర్శించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారని జాన్సన్ నాయక్ ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్లో వివరించారు.