రెబ్బెన, జూన్ 7 : సర్కారు బడుల్లో కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన విద్య అందుతున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం తక్కలపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి హాజరయ్యారు. ఆయన మా ట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం ఉంటుందని, బడీడు పిల్లలను గుర్తించి చేర్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం హ ర్షించదగిన విషయమని కొనియాడారు. ఈ సందర్బంగా హెచ్ఎం, ఉపాధ్యాయులు, అ మ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రచురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్‌ను ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌంద ర్య, ఎంపీటీసీ సంగం శ్రీనివాస్, డీఈవో అ శోక్, డీఆర్డీవో సురేందర్, సమగ్రశిక్ష కో ఆర్డినేటర్లు మధూకర్, భరత్, తహసీల్దార్ జ్యో త్స్న, ఎంపీడీవో శంకరమ్మ, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, హెచ్ఎం మహేశ్వర్‌రావు, ఐకే పీ ఏపీఎం వెంకటరమణశర్మ, ఈజీఎస్ ఏపీ వో రామ్మోహన్, తక్కలపల్లి, పులికుంట వీవో అధ్యక్షురాళ్లు, కాంప్లెక్స్ హెచ్ఎం ఉన్నారు.