నేరడిగొండ, జూలై 3 : రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సూచించారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు సూచనలు పాటిస్తూ సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిత సాగు పద్ధతులను పాటించాలన్నారు.
ఉచితంగా అందిస్తున్న పత్తి విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలిమా రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్‌సింగ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, మాజీ జడ్పీటీసీ అంబేకర్ పండరి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ ఆడెపు శ్రీకాంత్, నాయకులు సాబ్లె సంతోష్ సింగ్, సుజిల్, రాథోడ్ సురేందర్, ప్రతాప్‌సింగ్, శ్రీకాంత్‌రెడ్డి, నల్ల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.